హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కు వచ్చిన ఫిర్యాదుదారు కొల్లూరు వెంకట సత్య వరప్రసాద్ మరియు చిగురుపాటి వెంకటేశ్వర రావు వాళ్లకు విస్సన్నపేట మండలం పుట్రెళ్ళ గ్రామంలో ఆర్ఎస్ నెంబర్ 96 లో 5 ఎకరాల భూమిని కొనియున్నారు ఆ భూమిని ఆన్లైన్ చేయుటకు అప్లికేషన్ పెట్టగా ఎమ్మార్వో గారు అనేక పర్యాయాలు ఎమ్మార్వో ఆఫీస్ తిప్పుచు కాలయాపన చేసినారు. వారు సీనియర్ సిటిజన్ కావడంతో మన హెచ్ఆర్సీఐని ఆశ్రయించినారు. ఈరోజు ఆ విషయమై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు గారికి స్పందన లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు ఈ విషయమై సానుకూలంగా స్పందించి సంబంధిత ఆర్డీవో గారు తో మాట్లాడి త్వరలో ఈ సమస్యకు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో నేషనల్ జనరల్ సెక్రెటరీ నందం నరసింహారావు, ఏపీ ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ కొండా జయలక్ష్మి గారు, ఎన్టీఆర్ జిల్లా లీగల్ అడ్వకేట్ పెండ్యం రాజ్యలక్ష్మి గారు, ఎన్టీఆర్ జిల్లా లీగల్ అడ్వకేట్ బి రవికుమార్ గారు హాజరైనారు.